![]() |
![]() |
స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1112 లో....రాజు భ్రమరం ఇచ్చిన లక్ష రూపాయలను రేఖ చేతిలో పెట్టబోతే, పిన్ని చేతిలో అంత పెద్ద బాధ్యత ఎందుకు వద్దంటూ రాజు ఆ డబ్బులను లాక్కుంటాడు. లెక్కలన్నీ తప్పు అని భ్రమరం అంటాడు. మీరు ఇన్నేళ్లు పెట్టిన లెక్కలు తీయండి అని రాజు అడుగుతాడు. శేషు అల్లుడి తెలివితేటలను మెచ్చుకుంటే, ఇది అన్ని విషయాల్లోనూ వర్తిస్తుందని రేఖకు రాజు ఇన్ డైరెక్ట్‌గా గట్టి వార్నింగ్ ఇస్తాడు.
నందు, వెంకీ ఇద్దరూ ఫోటోలను చూసుకుంటూ తమ మనసులోని ప్రేమని పంచుకుంటూ భావోద్వేగానికి గురవుతారు. నేను నిన్ను ఇంకా మర్చిపోలేదని నందు అంటే, పరిస్థితులు అడ్డుపడుతున్నాయని, అందుకే దూరం చేసుకుంటున్నానని వెంకీ అంటాడు. ఆ అమ్మాయి ఫోటో నీ కంట్లోని బాధను ఆపలేకపోతుందని లక్ష్మి అంటుంది. అయితే తండ్రికి ఇష్టం లేని పని మాత్రం చేసేది లేదని వెంకీ తేల్చి చెప్తాడు. శేషు అందరికి బొచ్చెలు తెచ్చిచ్చి చివరకు మిగిలేది ఈ చిప్పలే అంటూ అడుక్కోవడానికి సిద్ధం కమ్మని ఎదగతాళి చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తున్నా రేఖ చూస్తూ ఊరుకోవడంపై భ్రమరం, భూషణ్ కోప్పడతారు. సుభాష్‌కి ఆపరేషన్ చేయిస్తున్నా నువ్వెందుకు సైలెంట్‌గా ఉన్నావని ప్రశ్నిస్తూ భూషణ్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇదంతా ఆ లక్కీ గాడి వల్లే జరుగుతోందని, ఇలాగే ఉంటే బావ చెప్పిందే నిజం అవుతుందని రేఖ తనలో తాను కుమిలిపోతుంది. ఇంకోవైపు రాజు తన పెమెంట్ డబ్బుల కోసం ఆలోచిస్తుంటాడు. ఇందు కావాలనే రాజుని కాసేపు ఆటపట్టిస్తూ చివరకు ఐదు లక్షలు చేతిలో పెడుతుంది. అది నిజాయితీగా సంపాదించిన డబ్బు కావడంతో రాజు ఎమోషనలై కన్నీళ్లు పెట్టుకుని ఇందును హత్తుకుంటాడు. ఈ డబ్బుల్ని తన తండ్రికి ఇస్తే సంతోషిస్తాడని రాజు అంటే, పదా వెళ్లి ఇద్దామని ఇందు అంటుంది. అలా ఇద్దరూ కలిసి చలపతి ఇంటికి వెళ్తారు. వారిని చూసి చలపతి ఇలా వచ్చారేంట్రా అని అడుగుతాడు. మీరే కదా బలవంతంగా పంపించారని రాజు అంటాడు. దానికి ఇష్టం లేకపోతే ఇన్ని రోజులు అక్కడ ఎందుకున్నావ్.. మరి రావొచ్చు కదరా అని చలపతి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Brahamamudi serial, Star Maa, Raj and Indu, Telugu television, latest episode update
![]() |
![]() |